సిద్ధిపేట: నకిలీ బంగారంతో బురిడీ

15చూసినవారు
సిద్ధిపేట: నకిలీ బంగారంతో బురిడీ
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాలలో ఏడాది క్రితం తవ్వకాల్లో దొరికినదిగా చెప్తూ నకిలీ బంగారం అమ్మాడు ఓ వ్యక్తి. అసలైనదిగా నమ్మిన కొన్నవాడు బ్యాంకులో అప్రైజర్‌తో తనిఖీ చేయించాడు. తప్పుడు సమాచారం ఇచ్చి రూ.5 లక్షల రుణం తీసుకున్నాడు. అప్పు చెల్లించకపోవడంతో వడ్డీల ఒత్తిడితో మరో వ్యక్తిని మోసగించాడు. మొత్తం 8 మందిని మోసం చేసినట్టు సమాచారం. ప్రధాన నిందితుడు ఏపీకి చెందినవాడిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్