కోహెడ మండలం వరికోలుకు చెందిన అనూష భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు ఇష్టంలేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈనెల 14న నిశ్చితార్థం కాగా మార్చి 6న పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో అనూష అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.