కోమటి చెరువుపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. శనివారం సిద్దిపేటలోని స్థానిక కోమటి చెరువు మరియు పరిసర ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్వెంచర్ పార్కు సమీపంలో ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని సూచించారు. అలాగే కోమటి చెరువు కట్ట, ఇతర ప్రాంతాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.