సిద్దిపేట స్థానిక మైదానంలో 16న ఉదయం 6 గంటలకు అండర్ 16,18,20, ఓపెన్ విభాగాల్లో 2, 4, 6, 10 కిమీ పరుగు పోటీలు బాల బాలికలకు వేరువేరుగా ఎంపికలు ఉంటాయని అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి కర్రోళ్ళ వెంకటస్వామి గౌడ్ ఆదివారం తెలిపారు. ఆసక్తి గలవారు పుట్టిన ధ్రుపత్రం తీసుకొని రాగలరు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 22న నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జరగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారు.