ఆశ, భయము, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని రాజగోపాలపేట ఎస్ఐ ఆసిఫ్ అన్నారు. శనివారం పోలీసు కళా బృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు కార్యక్రమం సిద్ధిపేట జిల్లా ముండ్రాయి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆశ, భయము, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, బ్యాంకు అధికారులు అని ఫోన్ చేస్తే నమ్మవద్దని, అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరం జరిగే అవకాశం ఉండదన్నారు.