సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ రూ. 5 లక్షల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయం పూర్తికావడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు, చక్రధర్ గౌడ్ కు, సహకరించిన శివప్రసాద్ గౌడ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.