విద్యాభివృద్దే లక్ష్యం కావాలని, విద్యారంగంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని మంత్రి పోన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రజలు, ప్రజా ప్రతినిధులు అందరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని విద్యాభివృద్దికి కృషి చేయాలని అన్నారు.