సిద్దిపేట పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం జరగనున్న ఆర్. సత్యనారాయణ సంతాప సభకు అందరూ హాజరుకావాలని సత్యనారాయణ మిత్రబృందం సభ్యులు కోరారు. బుధవారం వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన సత్యనారాయణ ప్రగతిశీల ప్రజాస్వామ్య ఉద్యమాల్లో భాగస్వాములయ్యారని, పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నాడన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారన్నారు.