సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూర్ మండలం ఘనపూర్ పెద్ద వాగు నిండి మత్తడి దుంకుతుంది. ఈ సందర్భంగా మంగళవారం రైతులు మండుటేండల్లో సైతం మత్తడి దూకుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తూ జల హారతి ఇచ్చారు. రంగనాయక సాగర్ కుడి కాలువ ద్వారా విడుదలైన జలాలతో మోయతుమ్మెద వాగు నిండి ప్రవహిస్తోంది. దీంతో కేసీఆర్, హరీష్ రావు ప్లెక్సీల ప్రదర్శనతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు.