ఆసుపత్రిలో బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స పొందుతున్న లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు మేరుగు మహేష్ తండ్రి మేరుగు మల్లేశంను మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం పరామర్శించడం జరిగింది. అనంతరం వైద్యులతో మాట్లాడి తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్య పడొద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చారు.