కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు హాజరైన సంగతి తెలిసిందే. ఈ విచారణ పూర్తైన అనంతరం హరీశ్ రావు నేరుగా కేసీఆర్ దగ్గరకు వెళ్లి కలిశారు. ప్రస్తుతం ఈ భేటీ హాట్ టాపిక్ మారింది. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా, విచారణ అనంతరం హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని, ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలిపారు.