బాల్యవివాహాల వల్ల భవిష్యత్తుకు తీరని నష్టం జరుగుతుందని నిర్మూలన అందరి బాధ్యతని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేటలోని కోర్టు భవనంలో బాల వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎన్జీవోస్, సఖీ, భరోసా, షీటీమ్ సిబ్బందిలతో కలిసి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిస్తే 1098 టోల్ నంబర్ ఫోన్ చేసి తెలపాలన్నారు.