సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 14 వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్టు అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్ డా. బి. అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, సభలు, సమావేశాలు, రాస్తారోకోలు నిర్వహించరాదన్నారు. అదే విధంగా డిజే సౌండ్ వినియోగంపై ఉన్న నిషేధాజ్ఞలు కూడా పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.