సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధి 5వ వార్డ్ లో కొమాండూరి శశిరేఖ(62) కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక బుధవారం వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలేశం గౌడ్, కోల వెంకటస్వామి, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.