నరాల వ్యాధితో బాధపడుతున్న శంకర్ కుటుంబానికి తెలంగాణ కాంగ్రెస్ అర్కిటెక్ట్స్ డోమైన్ దీప్యూటీ స్టేట్ హెడ్ భరత్ రెడ్డి రూ 10, 50, 000 ఎల్ఓసీ ని ఆదివారం అందజేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన శంకర్ నరాల వ్యాధితో బాధపడుతున్న విషయం భార్య రేణుక భరత్ రెడ్డి కి తెలియజేయడంతో అయన విషయాన్ని సిద్దిపేట ఇంచార్జి మంత్రి వివేక్ కు తెలియజేశారు. మంత్రి చొరవతో శంకర్ భార్య రేణుకకు ఎల్ఓసీ అందజేశారు.