సిద్ధిపేట: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

60చూసినవారు
సిద్ధిపేట: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. గురువారం టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం చిన్నకోడూరు మండలం రామంచ గ్రామానికి చెందిన పెద్దెల్లి తానేష్ సిద్దిపేటలోని హనుమాన్ నగర్లో అద్దె ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఎటువంటి ఉపాధి లేకపోవడంతో ఆర్థికఇబ్బందులు ఎక్కువై కుటుంబ పోషణకు అప్పులు చేసి తీర్చే మార్గం లేక గురువారం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్