సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో శుక్రవారం ఉదయం విషాద ఘటన జరిగింది. మద్దూరు మండలం నర్సాయపల్లికి చెందిన వృద్ధుడు కొమ్మూరి నర్సింహారెడ్డి ద్విచక్రవాహనంపై చేర్యాలకు వచ్చి రోడ్డుదాటుతుండగా, లింగంపల్లికి చెందిన కారు ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.