ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా నియామకమైన మంత్రి జి. వివేక్ వెంకటస్వామి తొలిసారి సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా శనివారం కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలోని రంగాధంపల్లి అమరవీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులు అర్పించారు. వారితో పాటు సిద్ధిపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఇమామ్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.