సిద్దిపేట: వడగండ్ల వర్షాలకు నష్ట పోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

83చూసినవారు
సిద్దిపేట: వడగండ్ల వర్షాలకు నష్ట పోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం రాజ్ గోపాల్ పేట్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాల, వడగండ్ల వర్షాలకు నష్ట పోయిన పంట పొలాలను ఎమ్మెల్యే హరీష్ రావు శనివారం పరిశీలించారు. వడగండ్ల వానతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. నంగునూరు మండల్ రాజగోపాల్ పేట్ గ్రామంలో వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించడం జరిగింది. రైతు రాగుల బాలయ్యకు మూడెకరాల పొలం ఉంది. రెండు లక్షల పైనున్న రుణాన్ని అప్పు తెచ్చి కట్టామని ఇంకా రుణమాఫీ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్