కేంద్రంలో అధికారంలో ఉన్నామని అహంకారంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాయకులపై మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష్య సాధింపులకు పాల్పడుతుందని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, బొమ్మల యాదగిరి మండిపడ్డారు. బుధవారం సిద్ధిపేటలోని ముస్తాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సోనియా గాంధీలపై ఈడీ కోర్టులో చార్జిషీట్ నమోదు చేయడానికి నిరసిస్తూ మోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.