మున్నూరు కాపుల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య, రాష్ట్ర నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ పాల సాయిరాం అన్నారు. సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ త్వరలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎల్లం, బాలయ్య, రాజయ్య, మురళి, పాండు తదితరులు పాల్గొన్నారు.