అవయవదానం ప్రాణదానంతో సమానమని చిన్నకోడూరు మండలం చందులాపూర్ ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు అన్నారు. పట్టు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ళ ఐలయ్య కుమారుడు వెంకటేష్ ఇటీవల బ్రెయిన్ డెడ్ తో మరణించగా అతని అవయవాలు దానం చేసిన సందర్భంగా శనివారం రాత్రి గ్రామంలో ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ మరణంలోనూ అవయవదానం చేసి ఇతరులకు ప్రాణం పోశాడని కొనియాడారు.