
భార్యను తీసుకెళ్లాడని అనుమానం.. కత్తితో దాడి
AP: ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడులో తెలంగాణలోకి కొత్తగూడేనికి చెందిన హేమంత్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. అతనిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి గాయపరిచారు. భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన తెండూల్కర్ నాయక్ భార్యతో హేమంత్ సన్నిహితంగా ఉంటున్నాడని ఇద్దరి మధ్య వివాదం జరుగుతోంది. తెండూల్కర్ నాయక్ భార్య అదృశ్యం అవ్వడంతో.. కుటుంబసభ్యులతో కలిసి హేమంత్పై కత్తితో దాడి చేశారు.