సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నియమితులైన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పూజల హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకమండలి సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.