సిద్దిపేట పట్టణంలోని స్థానిక 11 కేవీ ఫీడర్ పరిధిలో చెట్లకొమ్మల తొలగింపు కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని సిద్దిపేట అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమాన్ నగర్, టూటౌన్ పోలీస్ స్టేషన్, రంగీలా దాబా, సీసీ గార్డెన్, లింగారెడ్డిపల్లి, వేములవాడ కమాన్ తదితర ప్రాంతాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయము కలుగుతుందని అన్నారు.