సిద్ధిపేట: నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయము

59చూసినవారు
సిద్ధిపేట: నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయము
సిద్ధిపేట పట్టణంలోని స్థానిక 11కేవీ ఫీడర్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత్ నగర్, ఎన్సాన్పల్లి ఎక్స్ రోడ్డు, సాజీద్ పుర, కుషాల్ నగర్, ఆదర్శనగర్, శ్రీనివాస్ నగర్, కేసీఆర్ నగర్, మహశక్తినగర్, మారుతీనగర్ తదితర ప్రాంతాలలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్