సిద్దిపేట: తెలంగాణ హైకోర్టులో హరీశ్ రావుకు ఊరట

68చూసినవారు
సిద్దిపేట: తెలంగాణ హైకోర్టులో హరీశ్ రావుకు ఊరట
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. హరీశ్ రావు ఎన్నిక చెల్లదని దాఖలైన ఎలక్షన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. ఎన్నికల సమయంలో హరీశ్ రావు సరైన వివరాలు వెల్లడించలేదని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. హరీశ్ రావు తరపున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు వాదనలు వినిపించారు.