సిద్దిపేట: మృతులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి: హరీశ్ రావు

81చూసినవారు
సిద్దిపేట: మృతులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి: హరీశ్ రావు
పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదాలకు సరైన నివారణ చర్యలు తీసుకోకపోవడం ఈ ఘటన జరిగిందన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ మృతులకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్