సిద్దిపేటను ఆయిల్ పామ్ సాగులో ఆదర్శంగా నిలపాలి

76చూసినవారు
సిద్దిపేటను ఆయిల్ పామ్ సాగులో ఆదర్శంగా నిలపాలని వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను ఆదేశించారు. నర్మెటలో 65ఎకరాల విస్తీర్ణంలో రూ. 300 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రితుమ్మల మాట్లాడుతూ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీపైనే తొలి సంతకం చేశానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్