సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లోని పురాతన గణపతి ఆలయంలో శుక్రవారం సంకష్ట చతుర్థి పురస్కరించుకొని గణపతికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.