సిద్ధిపేట: నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రత్యేక నిఘా

62చూసినవారు
సిద్ధిపేట: నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రత్యేక నిఘా
నకిలీ విత్తనాలు, ఎరువుల రవాణ, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సిద్ధిపేట పోలీసు కమిషనర్ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ సమన్వయంతో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అక్రమార్కులపై పీడి యాక్ట్ అమలు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్