సిద్ధిపేట: విజయవంతంగా ముగిసిన స్విమ్మింగ్ ఎంపిక పోటీలు

58చూసినవారు
సిద్ధిపేట: విజయవంతంగా ముగిసిన స్విమ్మింగ్ ఎంపిక పోటీలు
సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక స్టేడియం స్విమ్మింగ్ పూల్లో మంగళవారం వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 5నుంచి 16 ఏండ్ల లోపు ఉన్న బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 130మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బటర్ ఫ్లై అంశాల్లో పోటీలు జరిగాయి. పోటీలను మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్ తదితరులు ప్రారంభించారు

సంబంధిత పోస్ట్