తనపై వేసిన అనర్హత పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందిచారు. ఇప్పటికైనా కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు మానుకోనుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించాలన్నారు. ఫోన్ టాపింగ్ కేసైనా, ఎన్నిక చెల్లదనే కేసైనా.. దురుద్దేశపూర్వకమేనని తేటతెల్లం అయిందని వెల్లడించారు.