సిద్దిపేట: పలు వార్డుల్లో నీటి సరఫరాకు అంతరాయం

79చూసినవారు
సిద్దిపేట: పలు వార్డుల్లో నీటి సరఫరాకు అంతరాయం
సిద్దిపేట పట్టణానికి లోయర్ మానేరు జలాశయం ద్వారా తాగునీరు సరఫరా చేసే పైపులైన్ జావారిపేట, గాలిపల్లి గ్రామం వద్ద లీకేజీ అయినందున మంగళవారం నీటి సరఫరా నిలిపివేస్తామని మున్సిపల్ కమిషనర్ సోమవారం తెలిపారు. లీకేజీలను అత్యవసరంగా మరమ్మతుల పనులు చేపట్టనున్న నేపథ్యంలో పట్టణంలోని 17, 19, 20, 21, 25, 26, 27, 30, 31, 35, 36, 37, 39, 41, 42 వార్డుల్లో నీటి సరఫరా ఉండదన్నారు. తిరిగి 12వ తేదీన పునరుద్ధరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్