సిద్దిపేట జిల్లా కేంద్రంలో మత సామరస్యం వెల్లివిరిసింది. మొహర్రం పండుగను పురస్కరించుకొని సిద్దిపేట లోని మూర్షద్ గడ్డ యువత ఆధ్వర్యంలో షర్భత్ పంపిణి కార్యక్రమం ఆదివారం చేపట్టారు. ఈ సందర్బంగా మెదక్ రోడ్డు పై షర్భత్ ను కుల మతాలకు అతీతంగా ప్రజలు స్వీకరించారు. తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్ అని.. మొహర్రం లాంటి పండుగను మతాలకు అతీతంగా చేసుకుంటామని అన్నారు .