
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మస్కట్ ఆవిష్కరణ
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కి సంబంధించి బీహార్ ‘గజ్ సింగ్’ అనే మస్కట్‌ను ఆవిష్కరించింది. మే 4 నుంచి మే 15 వరకు జరిగే ఈ క్రీడా మహోత్సవం పట్నా, నలందా (రాజగిర్), గయా, భాగల్పూర్, బేగూసరాయ్ అనే అయిదు జిల్లాల్లో జరుగుతుంది. ఈ సందర్భంగా "ఖేల్ కే రంగ్! బీహార్ కే సంగ్!" అనే నినాదంతో బీహార్ రాష్ట్రం క్రీడల రంగంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఈ గేమ్స్ బీహార్‌లో ఫస్ట్‌టైం జరుగుతున్న సంగతి తెలిసిందే.