విద్యార్థులు దేశభక్తిని కలిగి ఉండాలని బిజెపి సోషల్ మీడియా సిద్దిపేట జిల్లా కన్వీనర్ ముచ్చర్ల నాగరాజు అన్నారు. గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిన్నకోడూరు మండలంలోని ఓబుళాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సొంత ఖర్చుతో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. నాగరాజు మాట్లాడుతూ. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తూనే దేశభక్తిని అలవాటు చేయాలన్నారు. నేటి బాలలే రేపటి భావిభారత పౌరులన్నారు.