సిద్దిపేట జిల్లాలోని నారాయణరావు పేట మండలం, గుర్రాలగొంది గ్రామంలోని అభయాంజనేయ దేవస్థాన అన్నదాన భవనంలో శనివారం కవయిత్రి మంచినీళ్ల సరస్వతి రామశర్మచే అవధానం జరిగింది. ప్రాశ్నికులు అడిగిన అంశాలపై వివిధ ఛందస్సులలో పద్యాలు అందించి, సరస్వతి రామశర్మ అలరించారు. తెలుగు సాహిత్యానికి ప్రాణమైన అవధానం గ్రామాలలో కూడా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.