
ప్రముఖ కమెడియన్ బ్యాంక్ జనార్ధన్ కన్నుమూత
AP: ప్రముఖ కమెడియన్ బ్యాంక్ జనార్ధన్ (77) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కన్నడ, తెలుగు భాషల్లో బ్యాంకు జనార్ధన్ 500కు పైగా సినిమాల్లో నటించారు. 1948లో జన్మించిన ఆయన తొలుత బ్యాంకులో పని చేసేవారు. ఆ తర్వాత నాటక, చిత్ర రంగాల్లో ప్రవేశించి కమెడియన్గా మంచి గుర్తింపు పొందారు.