పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి

53చూసినవారు
వడగండ్లతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శనివారం సిద్దిపేట మండల పరిధిలోని ముండ్రాయి, రాజగోపాలపేట, పాలమాకుల, వెంకటాపూర్, మైసంపల్లి తదితర గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి మాట్లాడారు. ఏవోలు, ఏఈవోలు పంటలను పరిశీలించి సాగు చేస్తున్నది రైతా, కౌలు రైతా అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్