
ఇది చాలా బాధాకరం: మంద కృష్ణమాదిగ
వారసత్వ ప్రదర్శన కోసం నిర్వహించే లక్ష డప్పులు, వెయ్యి గొంతుకల కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ అన్నారు. ఈ నెల ఏడో తేదీన జరిగే ఈ కార్యక్రమాన్ని పలు అంశాల పేరిట అడ్డుకోవడం తగదన్నారు. 30 ఏళ్లపాటు వర్గీకరణ పోరాటం జరిగినా.. ఏనాడూ కూడా శాంతిభద్రతలకు తాము విఘాతం కలిగించలేదన్నారు. మాదిగ జాతి ప్రజల మూలాలను పరిరక్షించేందుకు ఈ ప్రదర్శనకు శ్రీకారం చుట్టామన్నారు.