ఆరేపల్లిలో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం
రాయపోల్ మండలం ఆరేపల్లి గ్రామంలో పెద్దమ్మ- పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా 3 రోజులు ఘనంగా నిర్వహించి, బుధవారం పెద్దమ్మ- పెద్దిరాజుల వివాహం జరిపించారు. అంతకుముందు శతాధియుక్త, మహా బలాభిషేకం, అమ్మవారికి దుర్బలి, విశ్వరూప సందర్శనం, మహా పూర్ణాహుతి వంటి కార్యక్రమాలను వేద పండితులతో ఛాత్రోయుక్తంగా అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు.