సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. బురుజు చౌరస్తా వద్ద గతేడాది తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో విగ్రహావిష్కరణ చేయాల్సి ఉంది. ఇంతలోనే గుర్తు తెలియని దుండగులు విగ్రహంపై కప్పి ఉంచిన ముసుగుకు నిప్పంటించారు. దీంతో విగ్రహం పాక్షికంగా కాలిపోయింది.