ఈనెల 7న జరిగే లక్ష డప్పుల వెయ్యి గొంతుకల కార్యక్రమ వాల్ పోస్టర్ ను సంఘాలకు, పార్టీలకు అతీతంగా సోమవారం సిద్ధిపేటలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహంవద్ద ఆవిష్కరించారు. ఎమ్మెస్పి జిల్లా అధికార ప్రతినిధి చుంచు రమేష్ మాదిగ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ హైదరాబాదులో ఈనెల 7న ఎల్బీ స్టేడియం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున జరిగే సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.