పట్టణ ప్రజలు సైతం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలి

85చూసినవారు
పట్టణ ప్రజలు సైతం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలి
స్వచ్ఛతా హీ సేవలో భాగంగా సిద్ధిపేట జిల్లా కోర్టు ఆవరణలో మున్సిపల్ సిబ్బందితో కలిసి కోర్టు అధికారులు, సిబ్బంది శ్రమదానం శనివారం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి స్వయంగా ఆవరణను శుభ్రం చేశారు. అనంతరం న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది స్వచ్ఛతా హీ సేవపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, ఏఈ అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్