వనజీవి రామయ్య మరణం తీరని లోటు: సిద్దిపేట కవులు

58చూసినవారు
వనజీవి రామయ్య మరణం తీరని లోటు: సిద్దిపేట కవులు
చెట్ల పెంపకం గూర్చి నిరంతరం శ్రమించిన పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం తీరని లోటని కవులు రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, సింగీతం నరసింహరావు, కోణం పర్శరాములు తెలిపారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలో శనివారం వారు మాట్లాడుతూ పట్టుదలతో ఎంతటి ఎత్తుకైనా ఎదుగవచ్చని అందుకు వనజీవి రామయ్య జీవితం ఆదర్శమని, తాను నడిచే ప్రతి బాటలో పచ్చదనం కనిపిస్తుందని, వనజీవి ఇంటి పేరుగా ఉండడమే రామయ్య కృషికి తార్కాణమన్నారు.

సంబంధిత పోస్ట్