సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో అధిక వర్షాల వలన ముంపుకు గురై రైతు వేదికలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి కలిసి ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. అక్కెనపల్లి రైతు వేదికలో రెవెన్యూ శాఖ వారిచే తాత్కాలిక శిబిరంలో అక్కెనపల్లి గ్రామానికి చెందిన 23 కుటుంబాలకు చెందిన 53 మంది వరద బాధితులు మంది ఆశ్రయం పొందుతున్నారు.