సిద్ధిపేట: భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము

51చూసినవారు
సిద్ధిపేట: భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము
భూ సమస్యలన్నింటినీ పరిష్కారానికి కృషి చేస్తామని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం కొమురవెల్లి మండలం కిష్టంపేటలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులనుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్