సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తితల్లి వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ ఎస్సై రవీందర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన వ్యక్తి 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటాడని చెప్పారు. నీలం రంగు షర్టు, బ్లాక్ రంగు ప్యాంటు ధరించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా గుర్తిస్తే 8712656746 నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.