గోవా నుంచి సంగారెడ్డి జిల్లాకు అక్రమంగా మద్యం సరఫరా చేసే అంతర్ రాష్ట్ర క్రిమినల్ హఫీజ్ ఖాన్ ను జహీరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మెదక్ డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జె హరికిషన్ నేతృత్వంలో జహీరాబాద్ సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం గోవా వెళ్లి హఫీజ్ ఖాన్ స్మగ్లర్ ని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.